
పయనించే సూర్యుడు న్యూస్ :ఉత్తరప్రదేశ్‌లోని శ్రావస్తి జిల్లా కైలాష్‌పూర్ గ్రామంలో జరిగిన ఒక షాకింగ్ సంఘటన మొత్తం గ్రామాన్ని కుదిపేసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు సభ్యులు వారి ఇంట్లోనే మరణించడం భయాందోళనలను రేకెత్తించింది. మృతులను రోజ్ అలీ, అతని భార్య షహనాజ్, వారి కూతుళ్లు గుల్నాజ్, తబస్సుమ్, ఒకటిన్నర కొడుకుగా పోలీసులు గుర్తించారు. ఈ కుటుంబం ముంబై నుంచి ఐదు రోజుల క్రితమే గ్రామానికి తిరిగి వచ్చింది. ఇంతలోనే మరణించడం అందరినీ కలిచివేసింది. అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.35 ఏళ్ల రోజ్ అలీ, భార్య, ముగ్గురు పిల్లల గొంతు కోసి చంపి.. ఆ తర్వాత తాను సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రోజ్ అలీ ఫ్యామిలీతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. తమ సోదరి పెళ్లికి సంబంధించిన పనుల కోసం వారు గ్రామానికి వచ్చారు. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు కుటుంబ సభ్యులు డోర్ తీయకపోవడంతో అలీ సవతి తల్లికి అనుమానం వచ్చింది. గ్రామస్థుల సాయంత తలుపులు పగలగొట్టి చూడం భార్యా, పిల్లలు రక్తపు మడుగులో పడి ఉండగా.. అలీ ఉరివేసుకుని కన్పించాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులతో సహా పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శ్రావస్తి ఎస్పీ రాహుల్ భాటి మాట్లాడుతూ.. మృతుడు ముంబైలో టైల్ లేయర్‌గా పనిచేస్తున్నాడని.. కార్తీక పూర్ణిమ ఉత్సవం కోసం ఇంటికి వచ్చాడని తెలిపారు. ఆ వ్యక్తి ఆత్మహత్యకు ముందు తన భార్య, పిల్లలను చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిపారు.తల్లి ఇంటికి వెళ్లడం విషయంలో భార్యాభర్తల మధ్య ఇటీవల వివాదం జరిగిందని తెలుస్తోంది. దర్యాప్తులో భర్త, భార్యకు మధ్య వివాదం ఉన్నట్లుగా తేలిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ వ్యక్తి తల్లి మాత్రం గతంలో గొడవలు ఉన్నప్పటికీ, ఇటీవల వారు ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు. అసలు విషయం నిగ్గు తేల్చేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.