
{ పయనించే సూర్యుడు} {నవంబర్ 15} మక్తల్
ఈరోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం లో జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు మక్తల్ జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ మరియు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న క్రియాశీల సభ్యత్వం కోసం క్రియా వాలంటీర్లు ఎన్నిక కోసం సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో మక్తల్ జనసేన పార్టీ నాయకులు మరియు నారాయణపేట నియోజకవర్గం నాయకులు పాల్గొనడం జరిగింది మరియు అదేవిధంగా డాక్టర్ మణికంఠ గౌడ్ గారు మాట్లాడుతూ నారాయణపేట జిల్లా మూడు నియోజకవర్గాలైన కొడంగల్ నియోజకవర్గం నారాయణపేట నియోజకవర్గం మరియు మక్తల్ నియోజకవర్గం నాయకులందరూ కలిసికట్టుగా పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని ఆయన అన్నారు

