
పయనించే సూర్యుడు నవంబర్ 15 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
ఈరోజు సూళ్లూరుపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చేని సూరి సహకారంతో ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ బాబు సూచనలు మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మన్నారుపోలూరు లో చిన్న గిరిజనీకాలలో 100 మందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగినది. మాబాషా మాట్లడుతు పవన్ కళ్యాణ్ సేవ స్ఫూర్తితో చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వలన చేని సూరి సహకారంతో ఈరోజు మన్నారుపోలూరు నందు చిన్న గిరిజన కాలనీలో 100 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగినది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన చేని సూరి కి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు మాభాష ఆవుల రమణ, నక్క హరిబాబు,కోటి యాదవ్, ఆవుల దాస్,వీర మహిళలు పద్మజ సుజాత పాల్గొన్నారు.