
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 15 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
ఏ.పీ.బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ నాయకులు కరపత్రాన్ని విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏ.పీ. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను ఇతర అవసరాలకు దారిమళ్లించడం తక్షణం ఆపి, వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించి, కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలను పూర్తిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కార్మికుల హక్కుల సాధనకై జరగనున్న ఈ ధర్నాలో అధిక సంఖ్యలో భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు పాల్గొని తమ ఐక్యతను చాటాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో
భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పెద్దన్న, రామాంజనేయులు, వరలక్ష్మి,సి.ఐ.టి.యు నాయకులు ఉమా గౌడ్, మహాలక్ష్మి, బషీర్ అహ్మద్, మాయకుంట్ల మోహన్ అలాగే అనేక మంది కార్మికులు పాల్గొన్నారు.
