
పయనించే సూర్యుడు న్యూస్ తేదీ 17 నవంబర్ సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.
పేద ప్రజల సొంతింటి కల ప్రజా పాలనలో సీఎం తో సాధ్యమైనది గద్వాల మండలం మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఈరోజు గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం పరిధిలోని బాస్రా చెరువు గ్రామంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు.బాస్రా చెరువు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లులో మొదటి దశలో పద్మమ్మ మంజూరు కావడం జరిగినది. నేడు ఇల్లు నిర్మాణం చేసుకొని నూతన గృహప్రవేశానికి ఎమ్మెల్యే రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కానుకను అందజేశారు ఎమ్మెల్యేకి లబ్ధిదారులు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూనూతన ఇందిరమ్మ ఇల్లు ను ప్రారంభించిన లబ్ధిదారులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లు చేపట్టిన పథకం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కావడం లబ్ధిదారులు నూతన గృహప్రవేశం చేయడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.ప్రజా పాలనలో భాగంగా గద్వాల నియోజకవర్గంలో గద్వాల మండల పరిధిలోని బాస్రా చెరువు గ్రామంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం జరిగినది. నేడు ఇల్లు పూర్తి నిర్మాణం చేసుకొని ప్రారంభించుకోవడం జరిగినది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరు పేదలైన ప్రజలకు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయించి వారికి విడతల వారీగా వారి ఖాతాలు డబ్బులను ఐదు లక్షల రూపాయలను నమోదు చేయడం జరిగింది. వాటికి తోడుగా లబ్ధిదారులు మరికొంత డబ్బులను తో ఇంటిని అన్ని వసతులతో ఏర్పాటు చేసుకోవడం జరిగినది.గద్వాల నియోజకవర్గంలో మొదటి విడత లో 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం జరిగినది. దాదాపుగా 1500 పైగా ఇండ్లు నిర్మాణం పనులు కొనసాగుతున్న. త్వరగా ఇంటి నిర్మాణం పనులు పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు చేయాలి. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పేదింటి ప్రజల సొంతింటి కల ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డితో సాధ్యమైనది అని పేర్కొన్నారు.ప్రజలు ఎవరు కూడా ఆందోళన అపోహాలు పడాల్సిన అవసరం లేదు ఇల్లు కట్టించుకుంటే డబ్బులు రావని అపోహాలు వద్దు ఇల్లు రానివారికి ఎవరు కూడా అపోహ పడవద్దండి. రెండో విడతలో త్వరలో కూడా అర్హులైన లబ్ధిదారులు కు మంజూరు ఏవిధంగా కృషి చేస్తామని తెలిపారు.ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిర్మాణానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం శ్రీ రేవంత్ రెడ్డికి గృహనిర్మాణ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి గద్వాల నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు జోగులాంబ గద్వాల జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు మాట్లాడుతూఎన్నో ఏళ్ళు గా మా సొంతింటి కల ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారథ్యంలో ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి మాకు చాలా సంతోషంగా ఉన్నది మేము ఎల్లప్పుడూ సీఎం మంత్రికి మా ఎమ్మెల్యేకి రుణపడి ఉంటామని వారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, జిల్లా రైతు సమితి సంఘం మాజీ అధ్యక్షుడు చెన్నయ్య, జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రమేష్ నాయుడు ఆలయం కమిటీ చైర్మన్ బోయ వెంకటరాములు మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, మాజీ సర్పంచ్ హరిత నరసింహా రెడ్డి, నాయకులు కృష్ణ రెడ్డి, రంగన్న, కిరణ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
