
(జనం న్యూస్ 17 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి)
భీమారం మండల ప్రజల సమస్యలను ప్రతిఫలించాల్సిన ప్రజావాణి అధికార ప్రతినిధుల నిర్లక్ష్యంతో నిర్వీర్యం అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణుల రహదారి సమస్యలు, పౌరహక్కుల అంశాలను సంబంధిత శాఖలు పట్టించుకోకపోవడం వల్ల ప్రజల స్వరం ప్రభావం కోల్పోతోందని వారు పేర్కొన్నారు., పంచాయతీలలో, ప్రజా స్వరాన్ని వినాల్సిన బాధ్యత ఉన్నవారు స్పందించకపోవడంతో “ప్రజావాణి నిర్వీర్యం అవుతున్నదా?” అనే ప్రశ్న స్థానిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజాస్వరం బలహీనపడితే సామాజిక అభివృద్ధి పెనుముప్పులో పడుతుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.