
విద్యార్థులతో కలిసి భోజనం చేసి న కౌన్సిలర్
పయనించే సూర్యుడు నవంబర్ 17 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు పట్టణంలోని 20వ వార్డు పరిధిలో ఉన్న సోషల్ వెల్ఫేర్ ఎస్సీ హాస్టల్ ను నేడు స్థానిక వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి సందర్శించారు. ఇక్కడ విద్యార్థులకు అందుతున్న భోజన వసతి ఇతర వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే మొత్తం 85 మంది విద్యార్థులు ఈ హాస్టల్లో ఉండి విద్యాబోధన చేస్తున్నారు. ఈరోజు హాస్టల్ ను స్థానిక వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి పరిశీలించి విద్యార్థులకు అందుతున్న భోజన వసతి ఇతర వసతుల గురించి విద్యార్థులతో అడిగి తెలుసుకొని విద్యార్థులకు స్వీట్లు పంచారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలలో మరియు హాస్టల్ లలో ఉండే విద్యార్థులకు సరైన వసతులు అందించాలని తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశించిన విధంగా తమ నేత రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనలతో తన పరిధిలో ఉండే వివిధ హాస్టలను పాఠశాలలను పరిశీలించి ఇక్కడ విద్యార్థులకు ఉండే సమస్యలను తెలుసుకొని తమ మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు నేడు ఇక్కడ పరిశీలించినట్టు వారు తెలిపారు.ఇక్కడ విద్యార్థులతో కలిసి భోజనం రుచి చూసి హాస్టల్ ను పరిశీలించినట్లు వారు తెలిపారు.ఈ హాస్టల్లో అన్ని వసతులు బాగానే ఉన్నాయని భోజనం కూడా రుచికరంగా ఉందని కౌన్సిలర్ సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించేందుకు ప్రతినెల హాస్టల్ ను పరిశీలిస్తానని సురా భాస్కర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న వసతులతో విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉజ్వల భవిష్యత్తును పొందాలని సూచించారు.వీరితోపాటు ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వార్డెన్ స్పందన . టిడిపి 20వ వార్డు అధ్యక్షులు గురునాథం. శ్రీనయ్య, నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు.. హాస్టల్ ను పరిశీలించి తమ సమస్యలను తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి కి హాస్టల్ విద్యార్థులు మరియు హాస్టల్ వార్డెన్ స్పందన మేడం కు ధన్యవాదాలు తెలిపారు.
