
షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే చేయాలి.
ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి.
మెగా డీఎస్సీ నుండి వచ్చిన గిరిజనేతర ఉపాధ్యాయులను వెనక్కి పంపించాలి.
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ విఆర్ పురం,నవంబర్06()
ఈనెల 9వ తేదీ నుండి వి ఆర్ పురం మండలం కొటారి కొమ్ము గ్రామం నుండి ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో ఆదివాసి సత్యాగ్రహ యాత్ర ప్రారంభం అవుతుందని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్ అన్నారు. స్థానిక రేఖపల్లిలో వెటకాని మల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో అనిల్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకు సభ సాక్షిగా కూటమి ప్రభుత్వం రాగానే జీవో నెంబర్ ని పునరుద్ధరిస్తామని, ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని,షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చేసి స్థానిక నిరుద్యోగులతోనే టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, మెగా డీఎస్సీలో ప్లైన్ ఏరియా నుంచి వచ్చిన గిరిజనేతర టీచర్లను తిరిగి ప్లైన్ ఏరియా కి పంపించాలని, పలు డిమాండ్లతో సత్యాగ్రహ యాత్ర ఉంటుందని ఈ యాత్రలో ప్రతి ఒక్క ఆదివాసి నిరుద్యోగ యువతీ యువకులు ఆదివాసి మేధావులు,రాజకీయ నాయకులు,ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఏజెన్సీలో 1/59,1/70,పెసా, చట్టాలకు రక్షణ లేకుండా పోతుందని,ఈ చట్టాలను పకడ్బందీగాఅమలుచేయకపోతే రానున్న కాలంలో మరో కొమరం భీమ్ పోరాట స్పూర్తితో ఆ తరహా ఉద్యమాన్ని చవిచూస్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు సేవా సంఘం జిల్లా నాయకులు చిక్కల బాలకృష్ణ పాల్గొని మాట్లాడుతూ పోలవరం, రంపచోడవరం, చింతూరు సబ్ డివిజన్ లను కలిపి స్వచ్ఛమైన ఏజెన్సీ జిల్లాగా ప్రకటించాలని, అది వీలు కాకపోతే అల్లూరి జిల్లా లోనే ఈ ప్రాంతాన్ని కొనసాగించాలని, మరెమైనా కుట్ర కోణంతో ప్లైన్ ఏరియాలో కలిపే ప్రయత్నం చేస్తే ఆదివాసి సంఘాలుగా చూస్తూ ఊరుకోబోమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ మెడికల్ అండ్ హెల్త్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి జోగారావు,జేఏసీ డివిజన్ ఉపాధ్యక్షులు ఉయిక రాంప్రసాద్,ఆదివాసి సంక్షేమ పరిషత్ వి ఆర్ పురం మండల అధ్యక్షులు పాయం లక్ష్మణరావు, కొండా రెడ్ల సంఘం నాయకులు మూర్ల కనక రెడ్డి, ఆదివాసి సీనియర్ నాయకులు బేతి ముత్తయ్య,సోడే భానుప్రసాద్, మూర్ల మహేష్ రెడ్డి, పొగల అప్పలరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
