
పయనించే సూర్యుడు న్యూస్ తేదీ: 18 నవంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న.
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఈరోజు అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్ కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అలంపూర్ నందు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ వారి సౌజన్యంతో మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వ కనీసం మద్దతు ధర క్వింటాలకు రూ. 2400 నిర్ణయించడం జరిగింది. మొక్కజొన్న పంట కోసిన తర్వాత రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎమ్మెల్యే రైతులకు వివరించడం జరిగినది. మొక్కజొన్నను వలిచిన తర్వాత బాగా ఎండలో ఆరబెట్టాలి. తెగులు సోకిన రంగు మారిన ముడుచుకుపోయిన గింజలను సాధ్యమైనంతవరకు ఏరివేయాలి అని రైతులకు తెలియజేయడం జరిగింది. బయట దళారులకు తక్కువ వరకు ఇచ్చి నష్టపోకుండా PACS సెంటర్ నందు అమ్మి అధిక ఆదాయం పొందగలరు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు,బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
