
పయనించే సూర్యుడు న్యూస్ :శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆధ్యాత్మిక శోభ కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు ఇవాళ్టి నుంచి 23 వరకు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ పుట్టపర్తికి వచ్చారు. శ్రీసత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా 100 రూపాయల నాణెం, స్టాంప్ విడుదల చేయనున్నారు ప్రధాని మోదీ.. పుట్టపర్తి విమానాశ్రయంలో ల్యాండ్ అయిన మోదీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి కాసేపట్లో ప్రధాని సత్యసాయి బాబా మహాసమాధికి చేరుకున్నారు. అక్కడ సత్యసాయిబాబాకు నివాళులర్పిస్తారు. తర్వాత హిల్ వ్యూ స్టేడియంలో జరిగే శతజయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా జీవితం, బోధలను స్మరిస్తూ మోదీ ప్రసంగిస్తారు. అలాగే బాబా స్మారకార్థం ప్రత్యేక నాణెం, స్టాంప్ విడుదల చేస్తారు.. త్వరలోనే ఈ నాణేలు ఆన్లైన్ బుకింగ్ ద్వారా విక్రయిస్తారు.