
పయనించే సూర్యుడు న్యూస్ :శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆయన తోపాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. క్రికెటర్ సచిన్, సినీ నటి ఐశ్యర్యారాయ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. శ్రీసత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న ప్రధాని మోదీ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, రైతులకు అందించే గోదాన కార్యక్రమంలో భాగంగా నలుగురు రైతులకు గోవులను దానం చేశారు. ఆ తర్వాత సాయి కుల్వంత్ సభా మందిరంలో ప్రధాని మోదీకి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. హిల్ వ్యూ స్టేడియంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాని తిలకించారు.అటు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐశ్వర్యరాయ్.. సత్యసాయి సేవా తత్వాన్ని గుర్తు చేసుకున్నారు. మానవసేవే మాధవ సేవ అని సత్యసాయి చెప్పారని ఐశ్వర్యరాయ్ గుర్తు చేసుకున్నారు. చదువే మనిషిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందన్నారు. బాల వికాస్ పేరుతో ఎన్నో వేలమంది పిల్లలను చదివిస్తున్నారు. లక్షల మందికి కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందిస్తున్నారు. సత్యసాయి ఆర్గనైజేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందని ఐశ్వర్యరాయ్ ప్రశంసించారు. పుట్టపర్తి అనేది లక్షల మందికి స్పూర్తినిచ్చే ప్రాంతమని క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. సత్యసాయి నుంచి నేను ఎంతో నేర్చుకున్నానన్న సచిన్, చిన్నప్పుడు నా హెయిర్‌స్టైల్ చూసి నన్ను చిన్న సత్యసాయి అనేవారన్నారు.1997 నుంచి సత్యసాయితో అనుబంధం ఉందని సచిన్ గుర్తు చేసుకున్నారు. ఎన్నోసార్లు పుట్టపర్తికి వచ్చి బాబా ఆశీర్వాదం తీసుకున్నానని, కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నాకు బాబా సరైన మార్గం చూపారన్నారు. ఎదుటివారిని ఎప్పుడూ జడ్జ్ చేయొద్దని, వీలైనంత మేరకు అర్థం చేసుకోవాలని బాబా చెప్పేవారన్నారు. 2011లో నేను లాస్ట్ వరల్డ్ కప్ ఆడే సమయంలో బాబా నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారని సచి టెండూల్కర్ అన్నారు.