
పయనించే సూర్యుడు న్యూస్: శబరిమల అయ్యప్ప స్వామివారిని దర్శించుకనేందుకు ప్రతి ఏటా లక్షలాది మంది అయ్యప్పలు శబరిమల వెళ్తుంటారు. అంతటి పవిత్రమైన ఆలయం వద్ద అపచారం జరిగింది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా అయ్యప్ప స్వామి దర్శనార్ధం కొందరు భక్తులు శబరిమల వెళ్లారు. అయితే అక్కడ అయ్యప్ప భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. క్యూ ఎక్కడ ఉంది అని ఓ స్వామి కేరళ పోలీసు అధికారిని అడిగినందుకు అతను తన పాంట్ జిప్ ఓపెన్ చేసి అసభ్యకరంగా సైగలు చేశాడని భక్తుడు వాపోయాడు. దీంతో ఆందోళనకు దిగడంతో ఇతర సిబ్బంది ఆ పోలీస్ అధికారిని సైలెంట్‌గా అక్కడి నుంచి బయటకు పంపించేశారని తెలిపారు.