
ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్"
(పయనించే సూర్యుడు నవంబర్ 19 రాజేష్)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డ్రగ్స్ నిర్మూలన ప్రతిజ్ఞ కార్యక్రమం ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌల్తాబాద్ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కళాశాల విద్యార్థిని విద్యార్థులు డ్రగ్స్ నిర్మూలన ప్రతిజ్ఞ చేయించడంతోపాటు కళాశాల ప్రిన్సిపల్ శ్రీ మధు శ్రీవాత్సవ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతి ఒక్క విద్యార్థినీ విద్యార్థులు అవగాహన కలిగి ఉండి డ్రగ్స్ నిర్మూలనకు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని సూచించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం.మంతా నాయక్ మరియు ఎం.సంపత్ కుమార్ అధ్యాపకులు జే. సుధాకర్ ఎం. లక్ష్మీనారాయణ డి. రాజు ఎస్.దయానంద్ ఈ. శ్రీనివాస్ రెడ్డి కే.శ్రీనివాస్ జె.భాగ్యమ్మ బి. రమ్య డి.పవన్ కుమార్ జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొనడం జరిగింది.