
"బీఎస్పీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్"
( పైనుంచే సూర్యుడు నవంబర్ 19 రాజేష్)
సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఉన్న సహాయ కార్మిక లేబర్ అధికారి కార్యాలయంలో ప్రజా సమస్యలను విన్నవించడానికి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు వెళ్లగా, అక్కడ అధికారులు అందుబాటులో లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగించింది. జిల్లా అధికారి గారికి ఫోన్ చేసినప్పటికీ, స్పందన లేకుండా ఉండటం ప్రజా సమస్యల పట్ల నిర్వాహక వ్యవస్థ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందని బీఎస్పీ నాయకులు ఎద్దేవా చేశారు. గత 15 రోజులుగా సంబంధిత అధికారిని సంప్రదించడానికి ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ, ఫోన్ రెస్పాన్స్ లేకపోవడం, కార్యాలయానికి వచ్చినా అక్కడ అధికారి అందుబాటులో లేకపోవడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు. ఈ నిర్లక్ష్యంతో రోజూ కార్యాలయానికి వచ్చే కార్మికులు, కూలీలు మరియు సాధారణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫిర్యాదు చేయడానికి కూడా అధికారులు లేకపోవడం పరిపాలనా వైఫల్యమని బీఎస్పీ తీవ్రంగా పేర్కొంది. బహుజన్ సమాజ్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ మాట్లాడుతూ “ప్రజలకు సేవ చేయాల్సిన అధికారి, ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నాడు. తక్షణమే సంబంధిత సహాయ కార్మిక లేబర్ అధికారిపై చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది” అని హెచ్చరించారు.కార్మికుల సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు, ప్రమాద బీమా, ఓవర్‌టైమ్, వేతన వివాదాలు నెలల తరబడి పెండింగ్ లో ఉన్నాయని అధికారి నిర్లక్ష్యంతో జిల్లా కార్మిక శ్రామికులకు న్యాయం అందడం లో ఆటంకం కలుగుతోందని ప్రభుత్వ పాలసీల అమలు కూడా సక్రమంగా జరగడం లేదని బాధ్యతా రాహిత్యాన్ని కొనసాగిస్తే జిల్లా ప్రజాభ్యున్నతి దెబ్బతింటుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండనోళ్ల నరేష్, నాయకులు కనక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.