
ఎమ్మెల్యే కోటా ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయి
(పయనించే సూర్యుడు నవంబర్ 19 రాజేష్)
దౌల్తాబాద్,నవంబర్ 19 : కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని పథకాలు ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ప్రతీ అర్హుడికి అందుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కర్నాల శ్రీనివాస రావు అన్నారు.బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్నాల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ దారా సత్యనారాయణ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండారు లాలు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొద్ది గ్రామాలకే డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించారని, కేటాయించిన చాలా ఇండ్లు నేటికీ పూర్తి కాలేదన్నారు.ఇళ్ల నిర్మాణంలో పారదర్శకత లేకపోవడంతో అనేక మంది పేదలు నష్టపోయారన్నారు.అలాగే ఎమ్మెల్యే కోటాలో కేటాయించే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చి నిజమైన అర్హులను పక్కన పెట్టారని విమర్శించారు.ఇకనైనా ఎమ్మెల్యే కోటా ఇళ్ల కేటాయింపులో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు చేరేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.