

పయ నుంచే సూర్యుడు సెప్టెంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) కాట్రేనికోన అన్న క్యాంటీన్ దగ్గర ఓల్డ్ అయినాపురం డ్రైన్ వంతెన వద్ద ఏకలవ్య విగ్రహ ఏర్పాటుకు అనుమతి విషయమై అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి సరళాదేవి ఆధ్వర్యంలో బుధవారం అధికారులు,గ్రామస్తులతో కలిసి సంయుక్త స్థల పరిశీలన నిర్వహించారు. ఇటీవల అక్కడ విగ్రహాన్ని పెట్టే విషయంలో అభ్యంతరాలు రావడంతో నిలిచిపోయింది.దీంతో ఆ సామాజిక వర్గం వారు జిల్లా కలెక్టర్ అనుమతి కోసం దరఖాస్తు చేశారు.కలెక్టర్ ఆదేశాల మేరకు 11 శాఖలకు చెందిన అధికారులతో కూడిన కమిటీ స్థల పరిశీలన చేసింది.విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన స్థల పరిశీలన,భద్రత,ట్రాఫిక్ సమస్యలు,విద్యుత్ లైన్ల భద్రత మరియు డ్రైనేజీ వ్యవస్థకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండే అంశాలపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా చర్చించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేసుకున్న వివరాలను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి నివేదిక అందజేస్తామన్నారు.కమిటీ సభ్యులు ఇక్కడ ఏకలవ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించారని కలెక్టర్ అనుమతి వచ్చిన వెంటనే విగ్రహాన్ని నెలకొల్పుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఏ.భోగిరాజుతో పాటు అమలాపురం డీఎస్పీ టీఎన్ఎస్ ఆర్కే ప్రసాద్, ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్,కాట్రేనికోన తహసిల్దార్ రవి కిరణ్,ఎంపీడీవో బి.రాజేశ్వరరావు, ఎస్ఐ సత్యనారాయణ, కాట్రేనికోన పంచాయతీ సెక్రటరీ జెవివి సత్యనారాయణ, డ్రైనేజీ, పంచాయతీరాజ్, పిడబ్ల్యూడీ, ఫిషరీస్ తదితర 11 శాఖల అధికారులు, సిబ్బంది, స్థానిక పరిస్థితులను సమీక్షించారు.