
పయనించే సూర్యుడు నంద్యాల జిల్లా జి. పెద్దన్న,(6 నవంబర్ 2025)
నంద్యాల. ..భారత రత్న డా. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నవంబర్ 11, 2025 న “మైనారిటీ సంక్షేమ దినోత్సవం”ను నంద్యాల జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా మైనారిటీల సంక్షేమాధికారి శ్రీమతి సబిహా పర్వీన్ నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారికి తెలిపారు.ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ డా. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జీవిత చరిత్రపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు మూడు భాషల్లో (తెలుగు, ఇంగ్లీష్ & ఉర్దూ) హై స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలలో చదువుతున్న విద్యార్థి–విద్యార్థినుల కోసం నిర్వహించబడనున్నాయి. సంబంధిత పాఠశాలలు మరియు కళాశాలలు తమ తమ ప్రాంగణాల్లో ఈ పోటీలను నిర్వహించుకోవాలన్నారు . అదే విధంగా, నంద్యాల జిల్లా కేంద్రంలో నవంబర్ 11వ తేదీన మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.ఈ నేపథ్యంలో జిల్లా అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఏర్పాట్లను జిల్లా మైనారిటీల సంక్షేమాధికారి శ్రీమతి సబిహా పర్వీన్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మనియార్ ఖలీల్ , రీజినల్ ఉర్దూ డైరెక్టర్ హసముద్దీన్ , ఇమాములు సంఘం నాయకులు హాఫిజ్ అంజాద్ సిద్ధికి , షేక్ మహమ్మద్ రఫీ (మున్నా) తదితరులు పాల్గొన్నారు.

