
పయనించే సూర్యుడు న్యూస్ :భార్య తన మాట వినలేదన్న కోపం, ఏవరితోనే సహజీవనం చేస్తుందన్న అనుమానం.. ఇవన్నీ ఆమెను హత్య చేసేలా ప్రేరేపించాయి. తనకు దూరంగా ఉంటున్న భార్యను కసి తీరా గొంతు నులిమి భర్త హత్య చేశాడు.. ఈ షాకింగ్ ఘటన మంగళగిరి మండలం ఎర్రబాలెంలో చోటు చేసుకుంది. క్రిష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన శంకర్ రెడ్డి, లక్ష్మీ పార్వతికి వివాహం అయి ఐదేళ్లైంది. కొద్దీ కాలంపాటు ఇద్దరూ మచిలీపట్నంలోనే జీవించారు. అయితే మొదటి ఇద్దరి మధ్య సఖ్యత లేదు. ఈక్రమంలోనే ఎనిమిది నెలల కిందట విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో లక్ష్మీ పార్వతి ఐదు నెలల కిందట మంగళగిరి మండలం యర్రపాలెం వచ్చి అక్కడే నివసిస్తుంది. అయితే ఆమె మరొక వ్యక్తితో సహజీనవం చేస్తున్నట్లు శంకర్ రెడ్డి అనుమానించాడు. కొద్ది కాలంపాటు ఆమెపై నిఘా పెట్టాడు. చివరకు ఆమె సహజీవనం చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చాడు.మంగళవారం సాయంత్రం యర్రపాలెంలో భార్య ఉంటున్న ఇంటికి వచ్చాడు శంకర్ రెడ్డి. అక్కడ ఆమెతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే.. ఇద్దరూ పెద్ద పెద్దగా గొడవ పెట్టుకున్నట్లు స్థానికులు చెప్పారు. అనంతరం శంకర్ రెడ్డి లక్ష్మీ పార్వతిపై దాడికి యత్నంచాడు. ఆమె వెంటనే అతన్ని తప్పించుకొని పక్క ఇంటిలోకి పారిపోయింది. ఆమెను వెంటాడిన శంకర్ రెడ్డి కూడా పక్క ఇంటిలోకి వెళ్లాడు. ఆ ఇంటి తలుపులు మూసి లక్ష్మీ పార్వతి గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుండి పారిపోయాడు. మహిళను హత్య చేసిన విషయాన్ని స్థానికులు పోలీసులకు చెప్పారు. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంగళగిరి పోలీసులుత తెలిపారు.