
పయనించే సూర్యుడు న్యూస్ :యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెర ప్రయాణానికి పాతికేళ్లు పూర్తయ్యాయి. ఈ మైలురాయిని అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా తారక్ కెరీర్ ప్రస్తుతం అత్యున్నత దశలో ఉండడంతో ఈ సంబరాలు మరింత జోష్‌గా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సినీ ప్రస్థానాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. సరిగ్గా పాతికేళ్ల క్రితం నిన్ను చూడాలని చిత్రంతో తారక్ సినీ రంగ ప్రవేశం చేశారు. ఎన్టీఆర్ వారసుడిగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఆయన తొలి సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచారు. అయితే, ఆ వైఫల్యం తారక్‌లో మరింత పట్టుదలను పెంచింది. ఒక్కో సినిమాతో తనను తాను మెరుగుపరుచుకుంటూ స్టార్‌డమ్‌ను చేరుకున్నారు.