
పయనించే సూర్యుడు తేదీ 20 నవంబర్ బుధవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.
ఈరోజు హైదరాబాద్ లోని నందినగర్ నివాసం నందు మాజీ మంత్రివర్యులు,బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించి,BRS పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.