
అభినందించిన మాస్టర్ సాయినాథ్ యాదవ్
( పయనించే సూర్యుడు నవంబర్ 6 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్)
ఇటీవల జరిగిన పలు జాతీయ రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచిన షాద్నగర్ పట్టణంలోని ఢిల్లీ వరల్డ్ స్కూల్ విద్యార్థులకు ఈరోజు స్కూల్ ప్రిన్సిపల్ తులసి మేడం చేతుల మీదుగా సర్టిఫికెట్ మరియు మెడల్స్ ను విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తులసి మాట్లాడుతూ… విద్యార్థులు విద్యతోపాటు కరాటే కూడా నేర్చుకోవాలని ముఖ్యంగా బాలికలు కరాటే నేర్చుకోవడం ద్వారా వారిలో ఆత్మస్థైర్యం పెంపొందుతుందని దాని ద్వారా విద్యార్థులు చదువులపై కూడా దృష్టి పెట్టగలరని అన్నారు. అదేవిధంగా విద్యార్థులు కరాటే లో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు నా తరపున సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.