
పయనించే సూర్యుడు నవంబర్ 20,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
బేతంచెర్ల మండలం ఎంబాయి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-2ను జిల్లా కలెక్టర్ రాజకుమారి బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. అంగన్వాడీ భవనం, స్టాక్ రిజిస్టర్లు, వంటగది పారిశుధ్యం, పిల్లలకు అందిస్తున్న ఆహారం నాణ్యతను వివరంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్ నుంచి రోజువారీ కార్యక్రమాలు, పోషకాహారం పంపిణీపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారుల హాజరు, పాఠ్య ప్రణాళిక అమలు, వంట సిబ్బంది నిర్వహణ వంటి అంశాలను కూడా సమీక్షించారు.పిల్లలకు ఎటువంటి లొసుగులు లేకుండా నాణ్యమైన ఆహారం, పోషకాహారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. చిన్నారుల మానసిక అభివృద్ధికి ఆటలు, విద్యా కార్యకలాపాలు మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. ఈ సందర్భంగా నేలపై చిన్నారులతో కలిసి కూర్చొని, వారితో సరదాగా మాట్లాడి, వారి చదువు–ఆహారం గురించి అడిగి తెలుసుకుంటూ కాసేపు గడిపారు. కలెక్టర్‌ను అలా పక్కనే చూసి చిన్నారులు ఎంతో ఉత్సాహంగా స్పందించారు.