
పయనించే సూర్యుడు నవంబర్ 20 (పొనకంటి ఉపేందర్ రావు )
రాష్ట్ర సమితి సభ్యులు సిపిఐ కే.సారయ్య
టేకులపల్లి: మండల సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం గుగులోత్ శ్రీను అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే సారయ్య పాల్గొని మాట్లాడుతూ సిపిఐ వందేళ్ళ ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను విజయవంతం చేయాలని బుధవారం సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తెలిపారు. సత వసంతాల వేడుకల్లో సిపిఐ కు పూర్వ వైభవం వస్తుందని. లక్షలాదిమందితో భారీ బహిరంగ సభ ఉమ్మడి ఖమ్మం జిల్లా పట్టణంలో డిసెంబర్ 26వ తేదీన జరుగుతుంది. ఈ బహిరంగ సభకు 40 దేశాల ప్రతినిధులు. భారతదేశ ముఖ్య నాయకులు. వేలాదిమంది జన సేవా దళ్ కార్యకర్తలను సిద్ధం చేస్తున్నామని. సంక్షోభ సమయంలో ప్రజలకు భరోసా కల్పించేందుకు యువతకు శిక్షణ సామాజిక సేవా కార్యక్రమంలో జనసేన భాగస్వామ్యం కావాలని. నవంబర్ 21 రానున్న రాష్ట్ర ప్రజా జాతరకు ఘన స్వాగతం పలకాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు గుగులోత్ రామ్ చందర్. మండల నాయకులు అయిత శ్రీరాములు. ఎజ్జు భాస్కర్. జోగా నాగేంద్రబాబు. కే సతీష్. సిహెచ్ కోటేష్. టి లక్ష్మణ్ రాధాకృష్ణ సోనీ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు