
బిజెపి రాష్ట్ర నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
( పయనించే సూర్యుడు నవంబర్ 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
చౌదరిగూడ మండలం లచ్చంపేట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. అలాగే విద్యార్థులతో ముచ్చటించి చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు.అలాగే ఇటీవల విద్యార్థులకు పంపిన నోటు పుస్తకాలు అందినవా, లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.