
(పయనించే సూర్యుడు నవంబర్ 20 రాజేష్)దౌల్తాబాద్
: ఆపదలో ఉన్న కుటుంబాలకు అఖిలా రాజ్ ఫౌండేషన్ అండగా నిలుస్తుందని అఖిల రాజ్ ఫౌండేషన్ మండల కార్యదర్శి బొల్లం రాజేష్ పేర్కొన్నారు. మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో అఖిలా రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తోడుగా నిలవడమే ఫౌండేషన్ లక్ష్యం అని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యకు దూరం ఐనా వారికి అండగా నిలవడానికి సంస్థ ముందు వరసలో ఉంటుందని పేర్కొన్నారు. మానవత్వం, మనిషితనం లక్ష్యంగా కుల,మత, వర్గ బేధాలు లేకుండా అందరి అభ్యున్నతి కోసం అఖిల రాజ్ ఫౌండేషన్ తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో సూరంపల్లి మాజీ ఉప సర్పంచ్ స్వామి, సంస్థ సభ్యులు దండు భూపాల్. బొల్లం, చామంతి శేఖర్. బొల్లం. అశోక్. బొల్లం నాగేష్. శ్రీరాముల సుధాకర్ చామంతి రాజు. బొల్లం అనిల్ తదితరులు పాల్గొన్నారు.