
పయనించే సూర్యుడు నవంబర్ 20,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న పనుల్లో నాణ్యత లోపించిన, పర్యవేక్షణ కరువైన సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని, నాణ్యత లోపంగా పనులు చేసే కాంట్రాక్టును కూడా బ్లాక్ లిస్టులో ఉంచుతామని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, నంద్యాల జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ (దిశా) కమిటీ అధ్యక్షురాలు డాక్టర్ బైరెడ్డి శబరి హెచ్చరించారు.
గురువారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ లోని సెంటినరీ హాలులో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అధ్యక్షతన, నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి పర్యవేక్షణలో నంద్యాల దిశా కమిటీ (జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) సమావేశం జరిగింది.ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర అభివృద్ధికి నిధులు రాబట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంత శ్రామిస్తున్నారో ఎంపీలుగా మాకు తెలుస్తోంది. అన్ని శాఖల అధికారులు వీటిని గమనించి మన నంద్యాల జిల్లాకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు దుర్వినియోగం కాకుండా, నిరంతర పనుల పర్యవేక్షణ, నాణ్యతప్రమాణాలు పాటిస్తూ, సకాలంలో పనులు కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. మనకు కేంద్రం ఇచ్చిన నిధులు సకాలంలో ఖర్చు చేస్తే ఇంకా ఎక్కువ నిధులు వచ్చేందుకు అవకాశం ఉందని ఇది అధికారులు గుర్తించి పనులు చేయాలని ఆమె కోరారు. అన్ని శాఖల అధికారుల మధ్య సమన్వయం ఎంతో అవసరం అన్నారు. దిశా సమావేశంకు జాతీయ రహదారుల అధికారులు రాకపోవడం పట్ల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్కువ ఫిర్యాదులు ఆ రెండు శాఖల నుంచే వస్తున్నాయని జిల్లా కలెక్టర్ ద్వారా త్వరలో ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల అధికారులతో ఈ నెలాఖర్ లోనే సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు. 82 కేంద్ర ప్రభుత్వ పథకాలపై దిశా సమావేశంలో సమీక్షా నిర్వహించినట్లు ఆమె వివరించారు. నంద్యాల జిల్లా సమగ్రాభివృద్ధికి అన్ని శాఖల, అధికారుల సహకారం ఎంతో అవసరం అన్నారు.ఈ కార్యక్రమంలో కర్నూలు ఉమ్మడి జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి , డిప్యూటీ సి ఈ ఓ సుబ్బారెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ నాసరరెడ్డి, రాష్ట్రస్థాయి దిశా కమిటీ మెంబర్ లు నూకల సుస్మిత, పవన్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, యల్లాల బాబు, నంద్యాల జిల్లాస్థాయి దిశా కమిటీ మెంబర్ లు డాక్టర్ పి. బాబన్, డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, డిఆర్ఓ రామునాయక్, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
