
పయనించే సూర్యుడు, నవంబర్ 20( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరులోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గురువారం రైతులు నిరసనకు దిగారు. రైస్ మిల్లుకు వెళ్లిన తమ ధాన్యం బస్తాలను “ఐదు బస్తాలు కట్ చేస్తున్నాం” అని అధికారులు ఫోన్ చేసి చెప్పడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ముందే అన్ని ప్రమాణాలు పాటించి ధాన్యం విక్రయించిన తర్వాత కూడా ఇలా బస్తాలు కట్ చేయడం అన్యాయం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.