
అందని మెరుగైన వైద్య సేవలు…
రుద్రూర్, నవంబర్ 20 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని, చికిత్సలు చేయడంలో వైద్యులు రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని పేద ప్రజలకు అరకొరగా వైద్యం అందిస్తున్నారని ఆసుపత్రికి వచ్చే రోగులు వాపోతున్నారు. గురువారం రోజున పలువురు రోగులు ప్రథమ చికిత్స కొరకు ఆసుపత్రికి వెలితే ఇక్కడ ప్రథమ చికిత్స చేసే వారు లేరని, మేము ఇంటికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకుంటామని, మందులు ఇవ్వాలని అడుగగా, మందులు ఇవ్వమని రోగుల పట్ల వైద్యులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కంపౌండర్ ను నియమించాలని రోగులు కోరుతున్నారు.