
రుద్రూర్, నవంబర్ 20 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూర్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల ఆవరణలో గురువారం రోజున ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి 137 మంది రోగులు హాజరు కాగా ఇందులో 33 మందికి కంటి శుక్ల ఆపరేషన్, 6గురు రోగులకు కన్నుగుడ్డు మీద శుక్లపటలము నుండి కన్ను కొలిక ఉన్నట్టు నిపుణులు నిర్ధారించి లయన్స్ కంటి ఆసుపత్రికి రెఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడి సెంటర్ కోడ్ నెంబర్ 288 లో పిల్లలకు చాక్లెట్లు,బిస్కెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ అధ్యక్షులు లయన్ కె.వి మోహన్, కార్యదర్శి గుండూరు ప్రశాంత్ గౌడ్, జిల్లా చైర్మన్ లయన్ శ్యాంసుందర్ పహాడే సభ్యులు పుట్టి సాగర్, మాజీ ఎంపిటిసి అనిల్ పటేల్, క్యాంప్ ఇంచార్జ్ హనుమంతరావు కంటి నిపుణులు సతీష్, సిబ్బంది, రోగులు, అంగన్వాడీ టీచర్ రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
