
పయనించే సూర్యుడు న్యూస్ :రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. తిరుపతి శ్రీవారి దర్శనం చేసుకున్న రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్టుదేవ్, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతికి స్వాగతం పలికారు. శీతాకాల విడిదిలో భాగంగా నగరానికి వచ్చిన ముర్ము సాయంత్రం బొల్లారంలోని భారతీయ కళా మహోత్సవంలో రెండో ఎడిషన్ను ప్రారంభిస్తారు. ఈ వేడుకలకు పలు రాష్ట్రాల నుంచి కళాకారులు పాల్గొంటారు.రేపు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. సత్యసాయి శత జయంతి వేడుకల్లో భాగంగా ఆమె వెళ్లనున్నారు. ఇప్పటికే సత్యసాయి శతజయంతి వేడుకలకు ప్రధాని నరేంద్రమోడీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సత్యసాయి శతజయంతి వేడుకలకు ప్రముఖుల రాక సందర్భంగా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించిన మేరకు.. గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం ద్రౌపది ముర్ము తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.