
పయనించే సూర్యుడు నవంబర్ 21,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల జిల్లా, గత ప్రభుత్వం క్రూరంగా ఆలోచించి టిడ్కో గృహాలను పూర్తి చేస్తే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు కి మరియు టీడీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఒక చెడు ఆలోచనతో టిడ్కో ఇల్లును పూర్తి చేయలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు.ఈ సందర్భంగా స్థానిక అయ్యలూరు గ్రామంలో ఉన్న టిడ్కో ఇల్లు ను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ లబ్దిదారుల పేరున బ్యాంకు రుణాలు సేకరించి, ఆ డబ్బులను పక్కదారి పట్టించి, ఆయా లబ్దిదారులకు గ్రుహాలను ఇయ్యక పోగా, వారిపై బ్యాంకు రుణాల భారం వైస్సార్సీపీ ప్రభుత్వం మోపిందన్నారు . ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పుడు ప్రజల తరఫున ప్రభుత్వం కడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలోనే లక్ష టిడ్కో గృహాలను అర్హులైన వాళ్లకు అందించేలా ప్రణాళిక రూపొందించి ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న, ఎంఈ గుర్రప్ప, టిడ్కో హౌస్ అధికారులు , మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు
