
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
ఈ సందర్శనలో భాగంగా గ్రామాల్లో ఉన్న పోలింగ్ లొకేషన్స్ మరియు పోలింగ్ స్టేషన్లను పరిశీలించి అక్కడి సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు మరియు అవసరమైన చర్యలను పరిశీలించడం జరిగినది అలాగే, గ్రామాలలోని ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి, రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా మరియు స్వేచ్ఛగా జరిగేలా పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించాము. అంతేకాకుండా ప్రజలకు మాట్లాడుతూ:🔹 మీ ఓటు విలువైనది 🔹 ఎవరైనా డబ్బు, మద్యం, బహుమతి లేదా ప్రలోభాలకు గురి చేసి ఓటు వేయమని అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి 🔹 ప్రజాస్వామ్యం బలపడాలంటే ప్రతి ఓటరు తన ఓటును నిరభ్యంతరంగా, స్వేచ్ఛగా వినియోగించాలని అవగాహన కలిగించనైనది.చివరిగా, రాబోయే ఎన్నికలు పూర్తిగా శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపనైనది.కె.సందీప్ SIP — భీమ్గల్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్ జిల్లా
