
రుద్రూర్, నవంబర్ 21 (పయనించే సూర్యుడు,
రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండలకేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం రోజు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో లయన్స్ కంటి ఆసుపత్రి రకాసిపెట్ వారి సహాకరముతో కంటి నిపుణులు సతీష్ చే 54 మంది రోగులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది ఇందులో 11 మందికి మోతిబిందు ఉన్నట్టు గుర్తించి వారికి ఆపరేషన్ నిమిత్తం లయన్స్ కంటి ఆసుపత్రికి రెఫర్ చేయడం జరిగింది ఇందులో అవసరమైన రోగులకు కంటి చుక్కల మందులు మరియు నొప్పుల మాత్రలు ఉచితంగా ఇవ్వడమైనది ఈయొక్క కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లయన్ కెవి మోహన్, జిల్లా చైర్మన్ లయన్ శ్యామ్ సుందర్ పహడే, కార్యదర్శి లయన్ గుండూరు ప్రశాంత్ గౌడ్, సభ్యులు లయన్ పుట్టి సాగర్, లయన్ మల్లేష్ మరియు క్యాంప్ ఇంచార్జ్ హన్మంత్ రావు, గ్రామ మాజీ సర్పంచ్ షేక్ ఖాదర్ లింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.