
ప్రభుత్వ భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు
ప్రభుత్వ భూములకు హెచ్చరిక బోర్డులు కరువు
ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి ఆక్రమించుకోగా పత్రికల్లో కథనాలు వచ్చిన పట్టించుకోని అధికారులు
పయనించే సూర్యుడు నవంబర్ 08 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు మండలం లో ఉన్నటువంటి 25 గ్రామపంచాయతీలకు సంబంధించి ప్రభుత్వ భూములకు హెచ్చరిక బోర్డులు అనేది ఏర్పాటు చేయకపోవడం వల్ల భూ బక్క సురులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవాలని గద్దల ఎదురుచూస్తున్నారు రెవిన్యూ అధికారులు తొందరగా స్పందించి ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాకుండా ఉంటుంది కొన్ని గ్రామపంచాయతీలకు సంబంధించి ప్రభుత్వ భూములు అక్రమణకు గురైనట్టుగా మండల ప్రజల నోట బాగా వినపడుతున్న మాట మరి అది నిజమా అబద్దమా అనేది రెవెన్యూ అధికారులు పరిశీలన చేసి నిజ నిజాలు మండల ప్రజలకు తెలియపరచవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉంది అని మండల ప్రజలు గుర్తు చేస్తున్నారు ప్రభుత్వ భూములకు సంబంధించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములను రక్షణ కల్పించాలి. మండల కేంద్రంలో ఓ వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న విషయం మండల ప్రజలకు అందరికీ తెలుసు కానీ రెవెన్యూ అధికారులకు మాత్రం ఇప్పటివరకు తెలియకపోవడం చాలా బాధాకరం రెవెన్యూ అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూసిన పాపానికి లేదు.కబ్జాకు గురైన ప్రభుత్వ భూమి ని రెవెన్యూ అధికారులు వెంటనే పరిశీలించి అట్టి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు భూ కబ్జా చేసిన వ్యక్తిపై చట్టపరమైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ ప్రభుత్వ భూములకు హద్దులు ఏర్పాటు చేస్తేనే గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఉన్నట్టు గ్రామ ప్రజలకు అందరికీ తెలుస్తుంది ఒకవేళ అట్టి ప్రభుత్వ భూమిని ఎవరైనా కబ్జా చేయాలనుకున్న కానీ ప్రజలు ముందస్తుగా రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వగలుగుతారు. రికార్డులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి చాలావరకు అన్యక్రాంతమైనట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి మండలం అంతట ప్రభుత్వ భూములను సర్వే చేస్తే అక్రమ వ్యవహారం వెలుగు చూసే అవకాశం ఉంది సర్వే అనంతరం భూములకు హద్దులు ఏర్పాటు చేస్తే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే అవకాశం ఉంటుందని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఈ విషయంలో రెవెన్యూ అధికారులు స్పందిస్తారా లేదా అని వేచి చూడాల్సిందే
