
పయనించే సూర్యుడు నవంబర్ 21,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
ఆంధ్రప్రదేశ్ బెస్త సంక్షేమ & అభివృద్ధి కమిటీ రాష్ట్ర డైరెక్టర్ ప్రజా వైద్యశాల బెస్త మల్లికార్జున
(నంద్యాల కలెక్టర్రేట్ ) మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వం తోనే సాధ్యమని, మత్స్యకారుల నడ్డి విరిచే 217 జీవో రద్దు తో ఈ రాష్ట్రంలోని సాంప్రదాయం మత్స్యకారులకు అండగా మేమున్నాం అనే భరోసా కూటమి ప్రభుత్వం కల్పించిందని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగ 217 జీవో రద్దు చేసి మత్స్యకార జీవితాల్లో ఆనందం నింపిందని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, బిజెపి పార్టీకి, యువనేత నారా లోకేష్ బాబు కి మచ్చ శాఖ మంత్రి అచ్చం నాయుడు కి మంత్రి కొల్లు రవీంద్ర కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ మేరకు నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారంనాడు ఉదయం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆధ్వర్యంలో ఘనంగ నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అందులో భాగంగ గ్రామాలలో తిరిగి చేపలు అమ్ముకోవటానికి మోపేడ్ బండ్లు,మార్కెటింగ్ బండ్లు, చేపల రవాణాకు ఐసోలేషన్ బండ్లు, వలలు,అలాగే సబ్సిడీతో కూడిన చేపల విత్తనాలు పంపిణీ చేయడం జరిగిందని,50 సంవత్సరాలైనా మత్స్యకారులకు పింఛను ఏర్పాటు చేశారన్నారు. ఇప్పుడు కూడా ఆదరణ 3 కింద మత్స్యకాలకు త్వరలో పనిముట్లు అందివ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.అనంతరం గత కొన్ని దశాబ్దాలుగ పేరుకుపోయిన మత్స్యకారుల సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.జిల్లా లో చెరువులు కుంటలు కజ్జాకు గురి అయ్యాయని వాటికి సర్వే చేసి చుట్టూ కంచెలు ఏర్పాటు చేయాలని, ప్రాథమిక మత్స్య సహకార సంఘాల ద్వార చెరువులు కుంటల్లో పుడిక తీత పనులు అప్పగించాలని, వివిధ చెరువులు కుంటలు రిజర్వాయర్ల ద్వారా వచ్చే చేపలను మార్కెటింగ్ చేసుకునేందుకు నంద్యాల పట్టణంలో మోడ్రన్ చెపల మార్కెట్ నిర్మించి వాటి నిర్వహణ మత్స్య సహకార సంఘాలకు అప్పగించాలని, ప్రతి మున్సిపాలిటీలో మున్సిపల్ షాపుల్లో మత్స్యకారులకు షాపులు కేటాయించాలని, జిల్లా కేంద్రంలో మత్స్యకార భవనం నిర్మాణం చేపట్టాలని,జిల్లాలో నూతన మత్స్య మార్కెటింగ్ సొసైటీలు, మహిళా సోసైటీలు ఏర్పాటు చేయాలని మత్స్య సహకార సంఘాల్లో చనిపోయిన వ్యక్తులను తొలగించి నూతన సభ్యులను చేర్పించాలని, అర్హులైన మత్స్యకారులకు రాయితీ కూడిన ఇండ్లను నిర్మాణం చేయాలని,చెరువులు పనులు ప్రతి సంవత్సరం కాకుండ మూడు సంవత్సరాలకు ఒకసారి పెంచలని, అలాగే మత్స్య శాఖలో ఇన్చార్జి అధికారులతో మత్స శాఖ అభివృద్ధి కుంటుపడుతుందని మత్స శాఖలో ఉన్న ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని జిల్లా లోని సమస్యలను దృష్టికి తీసుకువచ్చారు.. త్వరలో జిల్లాలోని మత్స్యకారుల సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జేడీ హీరా నాయక్ , తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ . బెస్త సంఘం రాష్ట్ర నాయకులు గగ్గెర రమణయ్య , మార్కెట్ ప్రసాద్ , పాణ్యం సుబ్బయ్య , గొడుగు హరీష్ , బాలచంద్రుడు, గొడుగు మల్లికార్జున , పత్తికొండ బాలాజీ , జనసేన పార్టీ నాయకులు బొల్లవరం ప్రసాద్ , శ్రీనివాసులు. మత్స్యశాఖ జిల్లా అధికారులు,మత్స్య సహకార సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు