
మెగావత్ రవి మరియు కుటుంబ సభ్యులకు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు నవంబర్ 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం బండోనిగూడ గ్రామంలో మెగావత్ రవి నూతన గృహా ప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై వారి నూతన గృహంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మెగావత్ రవి మరియు వారి కుటుంబ సభ్యులకు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలిపి షాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ గొర్లపల్లి అశోక్,మాజీ పీఎసీఎస్ చైర్మన్ మామిళ విఠల్,బండన్ గూడ మాజీ సర్పంచ్ జెట్ట కుమార్,బీఆర్ఎస్ నాయకులు సమూలయ్య,రమేష్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.