
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఏరుగట్ల మండల కేంద్రంలో
మండలంలో అక్రమ ఇసుక రవాణా నిరోధించుటకు గాను, రెవెన్యూ మరియు పోలీసు సిబ్బంది భట్టాపూర్ గ్రామంలో తిరుగుచుండగా రూపాల బండ ప్రాంతంలో (14) ట్రాక్టర్ల అక్రమంగా నిలువచేసిన ఇసుక డంపును గుర్తించి సీజ్ చేయడం జరిగింది.ఇట్టి సీజ్ చేసిన (14) ట్రాక్టర్ల ఇసుకను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా సరఫరా చేయడం జరిగినది.మండలంలో ఎవరైనా ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను రవాణా చేసినట్లయితే, వాహనాలు సీజ్ చేసి, వాహనాలు, ఓనర్లు మరియు డ్రైవర్లపై కేసులు చేయడం జరుగుతుందని, ఇందుమూలముగా తెలియజేయడమైనది.