
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 21(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
తాడిపత్రి శాసనసభ్యులు జెసి అస్మిత్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం యాడికి మండల పరిధిలోని ఈరన్న పల్లె గ్రామంలో టి.డి.పి.మండల కన్వీనర్ దడియాల ఆదినారాయణ, ఆర్. డబ్ల్యూ. ఎస్. అధికారులతో కలిసి పర్యటించారు. గ్రామంలో నిరుపయోగంగా మారిన ఓ.హెచ్.ఆర్. ఎస్.ట్యాంకును పరిశీలించారు. త్వరలోనే ప్రధానమంత్రి జల్ జీవన్ యోజన పథకం క్రింద ఇంటింటికి కొళాయి ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్. డబ్ల్యూ.ఎస్ ఎస్.ఈ. దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు.
