
పయనించే సూర్యుడు నవంబర్ 22 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని బాపూజీ కాలనీ నివాసులు అయినటువంటి SC,ST,BC కోసం స్మశాన వాటిక (బరిల్ గ్రౌండ్) సర్వే నంబర్203/2 లో 78 సెంట్లు భూమి ఉంది కానీ ఇప్పుడు ఆ స్మశాన భూమి మాయమైంది కొంతమంది భూతాపం పట్టిన వ్యక్తులు ఆక్రమించుకొని ఆ భూమి స్వభావాన్ని మార్చేశారు. బాపూజీ కాలనీలో ఎవరైనా మరణిస్తే దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూళ్లూరు హరిజనవాడ దగ్గర ఉన్నటువంటి స్మశాన వాటికు అంతిమయాత్ర వాహనాలు ద్వారా భారీ ఖర్చుతో తరలిస్తున్నారు నిరుపేద ప్రజలు కష్టంతో ఉన్నటువంటి అంతిమయాత్ర యాత్ర చేస్తున్నారు ఎన్నిసార్లు రెవిన్యూ అధికారుల దృష్టికి మున్సిపల్ కమిషనర్ దృష్టికి సమస్య గురించి ప్రజలు. తెలియ జేసిన ఫలితం లేదు కనుక సూళ్లూరుపేట మండల తాసిల్దార్ (MRO) మరియు మున్సిపల్ కమిషనర్,అధికారులు కలసి ఈ స్మశాన భూమిని మండల సర్వే రు చేత సర్వే చేయించి హద్దులు ఏర్పర్చి ఆక్రమణదారుల
పై కఠిన చర్యలు తీసుకోవాలి మీరు నిర్లక్ష్యం చేస్తే ప్రజల ద్వారా ఉద్యమానికి సిద్ధమవుతామని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ పత్రిక ముఖంగా తెలియజేశారు
