
రుద్రూర్, నవంబర్ 22 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలోని జెఎన్సీ కాలనీలో గల ఎస్సి కమ్యూనిటీ హాల్ లో ఎస్సి యూత్ వారి సహాకారముతో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో శనివారం లయన్స్ బోధన్ ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కంటి నిపుణులు సతీష్, వారి సిబ్బందితో 68 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 10 మంది రోగులకు మోతిబిందు ఆపరేషన్, ఇద్దరు రోగులకు కన్నుగుడ్డు మీద శుక్లపటలమునుండి కన్ను కొలిక వరకు పెరుగుతున్న మాంసపుముద్ద (pterygium) కొరకు లయన్స్ కంటి ఆసుపత్రికి రెఫర్ చేయడం జరిగింది. అవసరమైన రోగులకు ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు లయన్స్ కెవి మోహన్, జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ పహడే, కార్యదర్శి గుండూరు ప్రశాంత్ గౌడ్, కాలనీ సభ్యులు పోతరాజు లింగం, రాము, గంగాధర్, రవి, సురేష్, మంజరి భీమ్ కుమార్, కాసుల శ్రీనివాస్, కందూర్ రాజు క్యాంప్ ఇంచార్జ్ హన్మంత్ రావు తదితరులు పాల్గొన్నారు.