
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో మండలం
ఏర్గట్ల శనివారం రోజున మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం క్రింద రైతులకు బర్ల షెడ్లు, గోర్ల షెడ్లు 28 మందికి మంజూరు కావడంతో నిర్మాణానికి మొదటగా రెండు షెడ్లు దొబ్బల లలిత, బద్దం హన్మంత్ రెడ్డి ది కొబ్బరి కాయ కొట్టి భూమి పూజ నిర్వహించి ప్లాన్ ప్రకారం ముగ్గు పోసిన ఏపీవో విద్యానంద్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రెండ్ల రాజారెడ్డి. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ మాట్లాడుతూ ఏర్గట్లకు షెడ్లు కావాలని అప్లికేషన్ పెట్టుకున్న అందరికీ మంజూరు అయినవి. వారందరూ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం నిర్మించుకుని ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నుండి ఒక్క షెడ్డుకు కొలతను బట్టి పని పూర్తి అవ్వగానే 70 వేయిల వరకు లబ్ధిదారుని ఖాతాలో వేస్తారన్నారు. మంజూరు అయినా ప్రతి ఒక్కరు పనులు ప్రారభించుకోవాలని అన్నారు. వీరు కాకుండా మాకు కావలి అనేవారు ఎవరు యున్న ఫీల్డ్ అసిస్టెంట్ కలిసి కావలిసిన పత్రాలు అందచేస్తే మంజూరుకు కృషి చేస్తామన్నారు. అట్లాగే రైతులకు పండించిన పంటలను అరబోసుకోవటానికి సీసీ ప్లాట్ పారములు కూడా మంజూరుకు ప్రభుత్వం సిద్ధముగా యుందని త్వరలో వివరములు తెలియజేస్తాము అన్నారు. ఇట్టి కార్యక్రమంలో సెక్రటరీ జాకీర్ , టెక్నికల్ అసిస్టెంట్ కిష్టయ్య, బద్దం లింగారెడ్డి, ముస్కు మోహన్, ఇందూర్ పెద్ద సాయన్న, కొలిప్యాక రవి, బద్దం ఇంద్ర, దండేవోయిన సాయన్న, ఇబ్రైంపట్నం పెద్ద ముత్తెన్న, దండేవోయిన సాయి,ఇబ్రైంపట్నం చిన్న గంగాధర్, రాజారాం సహదేవ్, రెండ్ల చిన్నోళ్ల రాజారెడ్డి, ఓర్సు రాములు , మెరుగు సురేష్ ఎస్కే సలీం, మాదస్తూ చిన్న భూమన్న, సున్నపు గణపతి, మెరుగు ముత్తెన్న, ఇబ్రైంపట్నం ట్రాక్టర్ ముత్తెన్న, ఫీల్డ్ అసిస్టెంట్ దొబ్బల రాజన్న, మేస్త్రీ అనిల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
