
పయనించే సూర్యుడు నవంబర్ 07,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
శిరివెళ్ల, మండల కేంద్రంలోని శిరివెళ్ల మేజర్ గ్రామపంచాయతీ ప్రజలకు స్వర్ణ పంచాయితీ సేవలు త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయని ఈవో అశ్విని కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ భవనంలో ఈవో అశ్విని కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరో సేవ అందుబాటులోకి తెచ్చిందన్నారు.ఆన్లైన్ లోనే ఇంటి పన్ను ఇతర టాక్స్లు లైసెన్సులు అనుమతులు చెల్లించే అవకాశం కల్పించిందని అన్నారు.ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా, గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఆన్లైన్లోనే ఇంటి పన్ను చెల్లించే డిజిటల్ సేవలను తీసుకురావాలని ఆదేశించడంతో శిరివెళ్ల మేజర్ గ్రామపంచాయతీలో ఆయా బిల్డింగ్ యజమానుల వివరాలను బిల్డింగ్ కొలతలు అప్రూవల్ పలు రకాల గ్రామపంచాయతీ పన్నుల వివరాలను డిజిటల్లైజేషన్ 90% పూర్తి చేసామన్నారు. గతంలో నగరాలు, పట్టణాల్లో మాత్రమే ఆన్లైన్ ద్వారా ఇంటి పన్ను చెల్లించేవారని ఇకపై పంచాయతీలలో కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్వర్ణ పంచాయతీ విధానంలో ఆన్లైన్లోనే చెల్లించే అవకాశాన్ని కల్పించిందని. శిరివెళ్ల మేజర్ గ్రామపంచాయతీలో గత కొన్ని రోజులుగా శ్రమిస్తూ అతి తక్కువ సమయంలోనే డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఈవో అశ్విని కుమార్ పేర్కొన్నారు. మొబైల్ ఉంటే చాలు ప్రజలు ఆన్లైన్లోనే ఇంటి పన్ను కొళాయి పన్ను లైసెన్సులు గ్రామపంచాయతీ ప్రాపర్టీ వేలం పాటలు తదితర దేవతలు ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు ఆన్నారు. గ్రామ ప్రజలలో అవగాహన చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు ఇఓ అశ్విని కుమార్ తెలిపారు.
