
పయనించే సూర్యుడు న్యూస్ :సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ఉదయం ఢిల్లీలోని రాష్ట్రప్రతి భవన్లో ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ సూర్యకాంత్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, గవర్నర్లు, పలువురు ముఖ్యమంత్రులు హాజరయ్యారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. అంతేకాదు ఫస్ట్‌టైమ్ వివిధ దేశాల నుంచి న్యాయమూర్తులు కూడా అటెండ్ అయ్యారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డ్ సృష్టించబోతున్నారు. జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి వరకు దాదాపు 15 నెలలపాటు పదవిలో కొనసాగుతారు హర్యానాలోని హిసార్ జిల్లా పెట్వార్ ఆయన స్వస్థలం. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సూర్యకాంత్ ..న్యాయవాద వృత్తిలో అంచలంచెలుగా ఎదిగారు. అతిచిన్న వయసులోనే హర్యానా అడ్వకేట్ జనరల్‌గా పనిచేశారు.పంజాబ్, హర్యానా హైకోర్టుల్లో అనేక కీలక కేసులను డీల్ చేశారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన సూర్యకాంత్, 2024 నుంచి సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.ఆర్టికల్ 370 రద్దు, దేశద్రోహ చట్టం నిలిపివేత వంటి కీలక తీర్పులిచ్చిన ధర్మాసనాల్లో జస్టిస్ సూర్యతకాంత్ సభ్యుడిగా వున్నారు. సుప్రీంతోపాటు అన్ని కోర్టుల బార్ అసోసియేషన్లలో మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయించాలని ఆదేశించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకాన్ని సమర్థిస్తూ.. రాజ్యాంగపరంగా చెల్లుబాటు అవుతుందంటూ ఆయన తీర్పునిచ్చారు. పెండిగ్ కేసులను పరిష్కరించడమే తన తొలి ప్రాధాన్యత అన్నారు జస్టిస్ సూర్యకాంత్. వీలైంతన త్వరగా పెండింగ్ కేసులను క్లియర్ చేసేందుకు సరైన మెకానిజాన్ని ప్రవేశపెడుతామన్నారు.