
పయనించే సూర్యుడు న్యూస్ :బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర(89) కాసేపటి క్రితం కన్నుమూశారు. ఇవాళ మధ్యాహ్నం మరోసారి అనారోగ్యానికి గురైన ఆయన ఆస్పత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కొద్ది రోజులకే 'షోలే' నటుడు కన్నుమూసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన 300లకు పైగా సినిమాల్లో నటించారు. 1997లో ఫిలింపేర్ లైఫ్ సాఫల్య పురస్కారం, 2012లో పద్మవిభూషణ్ అందుకున్నారు.