
షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం వెంటనే చేయాలి.
నిరుద్యోగ సంఘం అధ్యక్షురాలు గొర్రె మీన పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ నవంబర్ 7 ఈనెల 16 వ తేదీన చింతూరు లో జరిగే బహిరంగ సభనువిజయవంతంచెయ్యాలని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకు సభ సాక్షిగా కూటమి ప్రభుత్వం రాగానే జీవో నెంబర్ ని పునరుద్ధరిస్తామని, ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని, షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చేసి స్థానిక నిరుద్యోగులతోనే టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, మెగా డీఎస్సీలో ప్లైన్ ఏరియా నుంచి వచ్చిన గిరిజనేతర టీచర్లను తిరిగి ప్లైన్ ఏరియాకి పంపించాలని, గొర్రె మీనా డిమాండ్ చేశారు మేధావులు,రాజకీయ నాయకులు,ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఏజెన్సీలో 1/59,1/70,పెసా, చట్టాలకు రక్షణ లేకుండా పోతుందని,ఈ చట్టాలను పకడ్బందీగా అమలు చేయకపోతే రానున్న కాలంలో మరో కొమరం భీమ్, బిర్సముండ , చేగువేరా పోరాట స్పూర్తితో ఆ తరహా ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని ప్రభుత్వనీ హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో సవలం నవీన, రాఘవ గోరం,శ్రీను సోడే పాల్గొన్నారు