
"పలు గ్రామాలలో మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది"
(పయనించే సూర్యుడు నవంబర్ 24 రాజేష్ దౌల్తాబాద్)
దౌల్తాబాద్ మండల కేంద్రాల్లో పలు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల శ్రేయస్ కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పలు గ్రామాలలో చీరలు పంపిణీ చేయడం జరిగింది. సూరంపల్లి గ్రామంలో మరియు మాందాపూర్ పలు గ్రామాలలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది దుబ్బాక ఇన్చార్జి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇందిరమ్మ చీరలు పంపించడం జరిగింది. వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్నా సందర్భంతో పాటు ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకొని చీరలు పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. మహిళలు సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలను అమలు చేస్తున్నారని ఆడబిడ్డల శ్రేయస్సు కోసం ఫ్రీ బస్ సౌకర్యం కల్పించిందన్నారు. 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్. ఇందిరమ్మ క్యాంటీన్లు మీసేవ కేంద్రాల్లో బలోపేతం బస్సుల కొనుగోలుకు లోన్లు సోలార్ కేంద్రాలు ఏర్పాటు వడ్లు కొనుగోలు సెంటర్లు అప్పగింత ఇందిరమ్మ ఇల్లు మహిళ సభ్యులకు రూపాయలు 70 కోట్లు బ్యాంకు లోన్లు వంటి ఎన్నో కీలక నిర్ణయం తీసుకొని మహిళ అభ్యున్నతికి తోడ్పడుతుంది పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల అధ్యక్షులు తలారి నరసింహులు. అబ్బ గోని రాజు గౌడ్ మండల నాయకులు అన్నా రెడ్డి .సంపత్ రెడ్డి. చంద్రారెడ్డి దమ్మన్నగారి మల్లేష్ జంగం రాములు. మహేందర్ రెడ్డి. కేశ గారి ముత్యాలు. గంధం కృష్ణ జాంగిర్. చిందం లక్ష్మణ్. దండు భూపాల్. పాములపర్తి చంద్రం. గంగాధర నరసయ్య. బండి కృష్ణ. ముత్యాల శ్రీనివాస్. మహిళలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
