
రుద్రూర్, నవంబర్ 7 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వందేమాతరం సామూహిక గీతాలాపన చేశారు. ఈ సందర్బంగా ఎస్సై సాయన్న, బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. వందేమాతరం స్ఫూర్తిని భావి తరాలకు అందించే బాధ్యత మనదేనని అన్నారు. మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు రణ నినాదంలా నిలిచింది వందేమాతరం అని పేర్కొన్నారు. బంకిమ్చంద్ర ఛటర్జీ రాసిన ఈ గేయం యావత్ దేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించిందని, స్వతంత్ర సమరయోధులకు మనోబలాన్ని ఇచ్చిందని, బ్రిటిషర్లను వందేమాతరం అనే మాటే భయపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, రుద్రూర్ ఎస్సై సాయన్న, పోలీస్ బృందం, రుద్రూర్ మండల బిజెపి మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ, బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల పాల్గొన్నారు.
