
పయనించే సూర్యుడు నవంబర్ 24,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
రోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని వినతి తీసుకోవడానికి నిరాకరించిన ఆర్ఎంవోపై చర్యలు తీసుకోవాలి:- సిపిఎం.
నంద్యాల జిల్లా ఏర్పాటైన నాటి నుండి నేటి వరకు నంద్యాల పట్టణంలోని జిల్లా జనరల్ ఆసుపత్రిలో సమస్యలు విలయతాండవం చేస్తున్న పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం లేదని వెంటనే రోగుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహులు అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు వి ఏసురత్నం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్,పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కే మహమ్మద్ గౌస్, పి వెంకట లింగం,మౌలాలి పట్టణ కమిటీ సభ్యులు జైలాన్ లతోపాటు సత్యం, కేశాలు,నాగేంద్ర, రవి, రాణా, హుసేని, గోరెభాష లతో పాటు మరో 50 మంది పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.నాగరాజు, యేసురత్నం, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ లు మాట్లాడుతూ నంద్యాల జిల్లా అయినా తర్వాత అన్ని ప్రాంతాల నుండి వేలాదిమంది రోగులు నిత్యం వస్తున్నారని వారికి సరిపడే విధంగా ఓపి సెంటర్లు లేవని ఓపి సెంటర్ల సంఖ్యను వెంటనే పెంచాలని,డేటా ఆపరేటర్లతో పని చేయించాలని, అదేవిధంగా మారుతున్న పరిస్థితులలో గుండె జబ్బులు ఎక్కువ అవుతున్నాయని, రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లలేక సరైన సమయాలలో డబ్బులు లేక చనిపోవడం జరుగుతుందని, వెంటనే కార్డియాలజీ విభాగం ను ఏర్పాటు చేయాలని, ఆస్పత్రిలో అన్ని రకాల మందులు సరిపడా లేవని రోగులకు, ప్రజలకు అందుబాటులోకి 24 గంటలు తీసుకువచ్చేలా జనరిక్ మందుల షాప్ ఏర్పాటు చేయాలని,రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన విధంగా గర్భిణి లను నార్మల్ డెలివరీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని, నంద్యాల కు మెడికల్ కాలేజీ ఏర్పాటైన తర్వాత కూడా ఆసుపత్రిలో రోగుల సంఖ్య కు అనుగుణంగా సిబ్బంది నియామకాలు చేపట్టలేదని, వెంటనే ఖాళీగా ఉన్న సిబ్బంది నియామకాలను చేపట్టాలని, ఆసుపత్రికి రోగులను చూసేందుకు బంధువులు వందలాదిమంది వస్తున్నారని ఇక్కడ భోజనం చేసుకునేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు సరిపడా వసతి సదుపాయాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కారం చేయాలని లేకుంటే సిపిఎం పార్టీగా దశలవారీగా ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.అనంతరం వినతిపత్రం అందించేందుకు వెళ్లగా ఆస్పత్రి సూపరిండెంట్ లేకపోవడంతో అక్కడ ఉన్న ఆర్ఎంవో వెంకటేశ్వర్లు సిపిఎం నాయకత్వం సంప్రదించగా నాకు సంబంధం లేదు. నేను ఏ వినతిపత్రం తీసుకోను, నేను రాను నాకు ఎవరేమైపోయిన నాకేమీ అవసరం లేదు అంటూ నిర్లక్ష్యంగా ఫోన్లో నిమిషాల తరబడి మాట్లాడడానికి సమయం కేటాయించుకోవడం చాలా దుర్మార్గంగా ఉందని అటువంటి అధికారిపై తక్షణమే రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ ఎమ్ డి ఫరూక్ , జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ , డిఎం అండ్ హెచ్ ఓ వెంకటరమణ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గతంలో కూడా ఇలాగే స్పందించారని ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ఆర్ఎంఓ వైఖరి పై ఆందోళన చేయాల్సి వస్తుందని, రోగుల పట్ల ఆసుపత్రిలో సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతున్న వారి పట్ల నిర్లక్ష్యంగా వహిస్తూ మాట్లాడుతున్న ఇటువంటి అధికారులపై చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో ప్రజలే తిరగబడతారని అన్నారు.అభివందనములతో దర్శనం లక్ష్మణ్ సిపిఎం పట్టణ కార్యదర్శి, నంద్యాల.
