
పయనించే సూర్యుడు నవంబర్ 24,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
రైతన్నా - మీకోసం" పంచ సూత్రాలపై ఇంటింటికి తిరిగి రైతులకు అవగాహన కల్పించిన మంత్రి ఫరూక్ *
నంద్యాల మండలం, పోలూరు గ్రామంలో సోమవారం రోజున వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో "రైతన్నా - మీకోసం" కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ గ్రామంలోని రైతుల ఇంటింటికి స్వయంగా తిరిగి 'రైతన్నా-మీకోసం' పాంప్లెట్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు అండగా అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి, వాటి ప్రయోజనాల గురించి ఆయన రైతులను అడిగి తెలుసుకుంటూ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, "కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని . చంద్రన్న నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నాం" అని తెలిపారు. 'రైతన్నా-మీకోసం' కార్యక్రమాన్ని ఈ నెల నవంబర్ 24 నుండి 29 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావాలనే లక్ష్యంతో కూటమి సర్కార్ పంచ సూత్రాల విధానాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు.
రైతన్నా-మీకోసం పంచ సూత్రాలు:
