
పయనించే సూర్యుడు నిజమాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
ఈరోజు సోమవారం రోజున కమ్మర్ పల్లి మండల ఇనాయత్ నగర లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన
మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మహిళలకు చీరలు అందించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇందిరా మహిళా శక్తి పేరుతో నాణ్యమైన చీరలను అందిస్తుందని, గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంచిన చీరల నాణ్యతతో పోలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న చీరలు నాణ్యతతో కూడినవని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తుంది అని చెప్పినప్పటి నుండి ప్రశాంత్ రెడ్డి ఎలక్షన్లు వస్తున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం చీరలు పంచుతుంది అని మాట్లాడుతున్నాడని, కానీ చీరలు పంచుదామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా గాంధీ గారి జయంతి నుండి ప్రారంభించిందని, ఎన్నికల షెడ్యూల్ మూలంగా కొంచెం ఆలస్యమైంది అని ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు అనౌన్స్ కాలేదని ఆయన అన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి చీరాల నాణ్యత విషయంలో మాట్లాడాలి గాని అనవసరపు మాటలు మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేయొద్దని ,కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలు అన్ని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూనే ఉందని ,సన్న వడ్లకు బోనాసిస్తున్నామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందిస్తున్నామని, 500 రూపాయలకు వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లు పథకం పేరుతో ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నామని మానాల మోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులు మీ దగ్గరికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 2500 పింఛను మహిళలకు ఇస్తుంది అని చెప్పి ఇవ్వడం లేదు అని మీతో చెప్తారని కానీ పెన్షన్ అనేది రేషన్ కార్డుతో లింకు చేయడం జరిగిందని గతంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో ఏ ఒక్కరికి కూడా నూతన రేషన్ కార్డులు మంజూరు చేయలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతోమందికి రేషన్ కార్డులు మంజూరు చేసిందని డిసెంబర్ తర్వాత రేషన్ కార్డు పంపిణీ పూర్తి చేసిన తర్వాత పెన్షన్ అందరికీ అందించడం జరుగుతుంది అని, ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రెండు సంవత్సరాలుగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందిస్తుందని అది కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని దాన్ని మాత్రం ప్రతిపక్షాలు మాట్లాడడం లేదు అని ,కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళుతుందని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ప్రశాంత్ రెడ్డి ఇకనైనా అబద్ధపు మాటలు మాట్లాడటం మానుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులలో భాగస్వామ్యం కావాలని ఏవైనా సలహాలు ఉంటే చేయాలని మోహన్ రెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకెట రవి ,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తిప్పిరెడ్డి శ్రీను రాములు నాయక్ సుతారి రమేష్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
